డానిష్ నిర్మాణ సంస్థ షెర్నింగ్, తమ వద్ద ఉన్న టెస్లా కార్లన్నింటినీ వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఈ మేరకు కార్లను తిరిగి అప్పగిస్తున్న వీడియోను కూడా పంచుకుంది. టెస్లా కార్లు నాణ్యత లేనివని కాదని, కేవలం ఎలాన్ మస్క్ రాజకీయ నిబద్ధత, ఆయన బహిరంగంగా వ్యక్తం చేస్తున్న అభిప్రాయాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. "షెర్నింగ్‌లో, మేము కేవలం ఎలా నడపాలనేదే కాదు, ఎవరితో కలిసి ప్రయాణించాలనేది కూడా నిర్ణయించుకుంటాం. అందుకే మా టెస్లా కంపెనీ కార్ల తాళాలను తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాం. టెస్లా కార్లు చెడ్డవని కాదు, కానీ ఎలాన్ మస్క్ రాజకీయ నిబద్ధత, ఆయన బహిరంగంగా వెల్లడిస్తున్న అభిప్రాయాల (వాటిని విస్మరించడం కష్టంగా మారుతోంది) దృష్ట్యా, 'ఇంతకాలం ప్రయాణానికి ధన్యవాదాలు' అని చెప్పాలని ఒక కంపెనీగా మేము నిర్ణయించుకున్నాం" అని షెర్నింగ్ పేర్కొంది.
"ప్రస్తుతం టెస్లా బ్రాండ్‌తో ముడిపడి ఉన్న విలువలు, రాజకీయ దిశతో మేము సంబంధం కలిగి ఉండాలని అనుకోవడం లేదు" అని కంపెనీ స్పష్టం చేసింది. టెస్లా వాహనాలకు బదులుగా యూరోపియన్ కంపెనీల కార్లను కొనుగోలు చేస్తామని వెల్లడించింది.
ఇది కూడా చదవండి: ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చ! ఆ మూడు డిమాండ్లపై..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి!
ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!
ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..
ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?
ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!
లోకేశ్ తాజాగా కీలక సూచనలు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!
మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: